![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద త్రినయని సీరియల్ ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇందులో త్రినయనిగా నటించిన ఆషిక గోపాల్ పదుకొనె ఈ సీరియల్ తో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. కథలో రాజకుమారి అనే డైలీ సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆషిక. ఇక ఇప్పుడు తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఈ త్రినయని సీరియల్ తమిళ్ లో "మారి" పేరుతో జులై 4 నుంచి ప్రసారం కానుంది. నాకు తెలుగు నుంచి మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీ రావడం చాలా సంతోషంగా ఉంది అని అంది ఆషిక.
ఇక ఈ షూటింగ్ సెట్స్ కి వచ్చిన స్నేహ, సంగీత, శరణ్యతో కలిసి దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో షేర్ చేసింది. "సినిమా పరిశ్రమలోని అత్యుత్తమ నటీమణులను కలవడం గౌరవంగా భావిస్తున్నాను." అంటూ కాప్షన్ పెట్టింది . మారిగా తమిళ్ లో రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిని జులై 4 న రాత్రి 8 గంటలకు జీ తమిళ్ ఛానల్ లో కలుస్తానంటూ చెప్పింది ఆషిక.
ఇక ఈ సీరియల్ మొత్తం లేడీ ఓరియెంటెడ్ గా నిర్మించారు. ఈ సీరియల్ హీరోయిన్ తెలుగులో త్రినయని తమిళ్ లో మారి.అన్నమాట. ఎన్నో అతీంద్రియ శక్తులున్న అమ్మాయి. భవిష్యత్తును ముందుగా ఊహిస్తూ జరగబోయేది చెప్పి అందరితో తిట్లు తినే ఒక క్యారెక్టర్ ఈమెది. ఇక ఈమెకు ఒక అబ్బాయితో పెళ్లౌతుంది. ఐతే దుష్ట శక్తుల నుంచి తన భర్తను అతని ఫామిలీని ఎలా రక్షించుకుంది అనేదే సీరియల్. త్రినయనిలో చందు గౌడ, పవిత్ర జయరాం, జయలలిత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టిఆర్పి చార్ట్‌లలో ఈ న్యూ తమిళ డైలీ షో ఎలాంటి రేటింగ్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
![]() |
![]() |